హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు నల్గొండ నుండి


ఈ.వి.యం.లు తరలింపు


ఉప ఎన్నికల్లో ఉపయోగించేందుకు నల్గొండ నుండి ఈ.వి.యం.లు తరలింపు చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్,జాయింట్ కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో ఈ.వి.యం.గోడౌన్ లు తెరచి సూర్యా పేట జిల్లా హుజుర్ నియోజక వర్గ ఉప ఎన్నిక లకు సూర్యా పేట జిల్లా నుండి వచ్చిన అధికారులకు అప్పగించి తరలించారు. బెల్ కంపెనీ తయారు చేసిన  530 బ్యాలెట్ యూనిట్ లు,408 కంట్రోల్ యూనిట్ లు,438 వి.వి. ప్యాట్ లు ఇటీవల నల్గొండ పార్లమెంట్ నియజకవర్గ ఎన్నికల్లో వినియోగించిన వాటిని హుజూర్ నగర్ కు పంపిస్తున్నారు.